ఏడేళ్ళ క్రితమే కరోనా గురించి ఆ పేపర్లో వచ్చింది... కానీ...

ఏడేళ్ళ క్రితమే కరోనా గురించి ఆ పేపర్లో వచ్చింది... కానీ...

కరోనా వైరస్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది.  కరోనా కారణంగా ప్రపంచంలోని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.  చైనాలోని వూహాన్ నగరంలో ఈ వైరస్ పుట్టిందని, గబ్బిలాలు తినడం వలన వైరస్ వచ్చిందని చైనాను తిట్టిపోస్తున్నారు.  దీంతో చైనాను అభిమానించే కొంతమంది వ్యక్తులు పాత విషయాలను బయటకు తీస్తున్నారు.  చైనాను భయపెట్టిన కరోనా ఆ దేశంలో పుట్టింది కాదని, ఏడేళ్ళ క్రితమే అంటే 2013 వ సంవత్సరంలోనే యూరోప్ దేశాలలో పుట్టిందని, కాకపోతే అప్పట్లో పెద్దగా ఇది ప్రాబల్యం చూపించలేదని వాస్తవాలు తెలుసుకోవాలని అంటున్నారు.  అప్పట్లో పాపులర్ తెలుగు పత్రికలో వచ్చిన  విషయాలను కోట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.  

దీనిపై క్షుణ్ణంగా పరిశోధించిన కొన్ని పార్టీలు కరోనా వైరస్ లో ఎన్నో జాతులు ఉన్నాయని తేల్చారు.  వైరస్ అంటే దానికి ఒక రూపం ఉండదు.  చలనం ఉండదు.  ఏదైనా ఒక అతిధేయలోకి ప్రవేశించిన తరువాతే దానికి జీవం వస్తుంది.  అందులో ఉండే ప్రోటీన్ డిఎన్ఏ జీవం పోసుకొని విభజన చెందుతుంది.  గతంలో ప్రపంచాన్ని భయపెట్టిన సార్స్, ఎబోలా ఇవన్నీ కూడా కరోనా వైరస్ జాతికి చెందిన వైరస్ లే. వైరస్ చూపించే ప్రభావం, అది వ్యాప్తి చెందే తీరును బట్టి వైరస్ కు పేరును పెడతారు.  నొవెల్ కరోనా వైరస్ జాతికి చెందిన వైరస్ అయినప్పటికీ వూహన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ కు కోవిడ్ 19 అనే పేరును పెట్టారు.  ఏడేళ్ళ క్రితం యూరోప్ లో కలకలం సృష్టించిన ఈ వైరస్ వేరు, ఇప్పుడు ప్రపంచాన్ని  భయపెడుతున్న కరోనా వైరస్ వేరు అని ఇప్పటికైనా అర్ధం అయ్యిందనుకుంటాను.