ప్రశాంతంగా ముగిసిన ఏడో దశ పోలింగ్ 

ప్రశాంతంగా ముగిసిన ఏడో దశ పోలింగ్ 

సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. ఇందు కోసం కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. ఆదివారం జరిగిన చివరి దశ పోలింగ్ లో 918 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఎన్నికల్లో 10.01 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పోటీచేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానానికి ఈ విడతలోనే పోలింగ్‌ జరిగింది.  ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. చివరి విడత పోలింగ్‌లో భాగంగా చండీగఢ్‌ సీటుతో పాటు ఉత్తరప్రదేశ్‌(13), పంజాబ్‌(13), పశ్చిమబెంగాల్‌(9) బిహార్‌(8), మధ్యప్రదేశ్‌(8), హిమాచల్‌ప్రదేశ్‌(4), జార్ఖండ్‌(3) రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. కాగా ఎన్నికల తుది ఫలితాలు మే 23న వెల్లడికానున్నాయి.