జనగామలో మిన్నంటిన నిరసనలు...

జనగామలో మిన్నంటిన నిరసనలు...

జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో నిరసనలు మిన్నంటాయి. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్‌ ఇవ్వకపోవడంతో అక్కడి కార్యకర్తలు నిరసనల బాట పట్టారు. మంగళవారం కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరు ఆత్మహత్యకు యత్నించగా.. బుధవారం 13 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కంచె రాములు, మండల, పట్టణ కమిటీలు, బాధ్యులు, జడ్పీటీసీ, మాజీ సర్పంచ్‌లు, పలువురు కార్యకర్తలు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనగామలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజీనామాల నిర్ణయం తీసుకున్నారు. వారి వివరాలను డీసీసీ వరంగల్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపించారు. అనంతరం, 'ఇప్పటికైనా అధిష్టానం పొన్నాల లక్ష్మయ్యకు జనగామ సీటును కేటాయించాలని' వారు డిమాండ్ చేసారు.