బ్రిడ్జిపై రైలు ప్రమాదం.. పలువురి మృతి

బ్రిడ్జిపై రైలు ప్రమాదం.. పలువురి మృతి

డెన్మార్క్ లో ఈ ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 8 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. ది గ్రేట్ బెల్ట్ బ్రిడ్జిపై జరిగిన రైలు ప్రమాదంలో పలువురు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మరో ఎనిమిది మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. అధికారిక ప్రకటన మేరకు మృతుల సంఖ్య ఆరుగా చెబుతున్నారు. కానీ అనధికారిక కథనాల మేరకు ఈ సంఖ్య పదికి పైనే ఉండొచ్చని తెలిసింది. ది గ్రేట్ బెల్ట్ బ్రిడ్జి మధ్య డానిష్ దీవులైన జీల్యాండ్, ఫునెన్ లను కలుపుతుంది. డానిష్ మీడియా కథనం ప్రకారం బలంగా వీస్తున్న చలిగాలుల కారణంగా ఓ గూడ్సు రైలుపై టార్పాలిన్ విడిపోయి అందులోని కంటెయినర్లు ఎగురుతూ ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలుపై వచ్చిపడ్డాయి. దీంతో దారి కనపడక హఠాత్తుగా ఆపేయాల్సి వచ్చింది. దీంతో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు