క్రికెట్ సంబంధాలు తెంచుకోవడం మా పరిధిలో లేదు

క్రికెట్ సంబంధాలు తెంచుకోవడం మా పరిధిలో లేదు

ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశాలతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలన్న బీసీసీఐ వినతిని ఐసీసీ తిరస్కరించింది. ఇలాంటి వ్యవహారాలతో ఐసీసీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన తర్వాత సభ్య దేశాలలో ఉగ్రవాదానికి ఆశ్రయించేవాటితో సంబంధాలు తెంపులు చేసుకోవాలని కోరులూ బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసింది. 'అసలు ఇలాంటి జరిగే అవకాశాలే లేవు. ఏదైనా దేశాన్ని బహిష్కరించడంపై నిర్ణయాన్ని ప్రభుత్వ స్థాయిలో తీసుకుంటారని ఐసీసీ చైర్మన్ స్పష్టం చేశారు.
ఐసీసీ తరఫున అలాంటి నియమం ఏదీ లేదు. ఈ విషయం బీసీసీఐకి కూడా తెలుసు. కానీ బీసీసీఐ తన వంతుగా ప్రయత్నించిందని' ఓ బీసీసీఐ అధికారి పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు.

బీసీసీఐ తన లేఖలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించిందే తప్ప పాకిస్థాన్ గురించి ప్రస్తావించలేదు. శనివారం చైర్మన్ శశాంక్ మనోహర్ అధ్యక్షతన జరిగన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. కానీ దీనిపై చర్చకు తగినంత సమయం ఇవ్వలేదు. బీసీసీఐ తరఫున వర్కింగ్ సెక్రటరీ అమితాబ్ చౌదరి హాజరయ్యారు. 'సభ్య దేశాలకు చెందిన ఇంత మంది ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నారు. వాళ్లు ఇలాంటి అభ్యర్థనను కనీసం పరిశీలించరు. అయితే భద్రత విషయం కచ్చితంగా ఆందోళన కలిగించేదే. దానికి పూర్తి హామీ ఇవ్వడం జరిగిందని' బీసీసీఐ అధికారి చెప్పారు. 

రాబోయే ప్రపంచ కప్ లో టీమిండియా జూన్ 16న పాకిస్థాన్ తో ఆడాల్సి ఉంది. పుల్వామా ఉగ్రవాద దాడి తర్వత ఇదరు దేశాల మధ్య ఏర్పడిన రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ మ్యాచ్ ను బహిష్కరించాలనే డిమాండ్ పెరుగుతోంది.