బాసర ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపులు

బాసర ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపులు

బాసరలోని ప్రఖ్యాత ట్రిపుల్‌ ఐటీలో ఓ కీచక ప్రొఫెసర్ బాగోతం బయటపడింది... ఫెయిల్‌ అయిన విద్యార్థినులను టార్గెట్‌గా చేసుకుని.. వారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడం.. నా ఇంటికి వస్తే పాస్ చేస్తానంటూ వారిని లొంగదీసుకుని గుట్టుగా వ్యవహారాన్ని నడుపుతున్నట్టుతెలుస్తోంది. అతనడి మాటలు నమ్మిన విద్యార్థినులకు నచ్చితే ఇంట్లోనే పరీక్షలు రాయిస్తాడు.. అవసరమైతే ప్రశ్నప్రత్నాన్ని లీక్‌ చేయడం చేస్తాడు. ఎంతోకాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం నిన్న బయటపడింది. కెమిస్ట్రీ విభాగాధిపతిగా పనిచేస్తోన్న ఆ ప్రొఫెసర్‌ పేరు రవి వరాల. ఫెయిల్‌ అయిన విద్యార్థులను టార్గెట్‌గా చేసుకునే రవి.. వారి సెల్‌ఫోన్లకు అసభ్యకరమైన సందేశాలు పంపుతాడని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. వారి మొబైల్‌ ఫోన్లకు తన ఇంటి అడ్రస్‌ పంపి.. మా ఇంటికి వస్తే.. నిన్ను పాస్‌ చేస్తాను అని మభ్యపెడతాడు. గతంలో ఈయనపై ప్రశ్నపత్రం లీకేజీ ఫిర్యాదులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 20 మంది విద్యార్థినులకు ఇదే తరహా మెసేజ్‌లు పంపినట్టు అనుమానిస్తున్నారు.

ఏ వ్యవహారమైన గుట్టుగా ఎన్ని రోజులు ఉంటుంది... తాను ఓ విద్యార్థినిక పెట్టిన మెసేజ్‌లే ఆ ప్రొఫెసర్‌ మెడకు చుట్టుకున్నాయి... వివరాల్లోకి వెళ్తే పీయూసీ-2 సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు క్యాంపస్ కు వచ్చిన ఓ బాలిక... శనివారం ఇంటికి తిరిగి వెళ్లేందుకు వర్సిటీ నుంచి బయల్దేరింది. వర్సిటీ నిబంధనల ప్రకారం ఔట్‌పాస్‌ ఇచ్చే సమయంలో సదరు విద్యార్థినులు వారి పేరెంట్స్‌తో మాట్లాడాలి. శనివారం కూడా మీ ఫాదర్‌తో ఫోన్‌లో మాట్లాడించాలని విద్యార్థినికి సూచించింది వార్డెన్‌. అదే సమయంలో ప్రొఫెసర్ రవి వరాల మొబైల్ నంబరు నుంచి సదరు విద్యార్థినికి మెసేజ్‌లు వచ్చినట్టు గుర్తించారు. నిజామాబాద్‌లో ఉన్న మా ఇంటికి రా.. ఇదే అడ్రస్‌.. నిన్ను పాస్‌ చేయిస్తా.. అనేది ఆ మెసేజ్ సారాంశం. ఈ వ్యవహారాన్ని వార్డెన్ వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక, రంగంలోకి దిగిన అధికారులు.. విద్యార్థినిని విచారించగా.. ఇంటికొస్తే పాస్‌ చేస్తానని రవి సార్ చెప్పారని ఆ బాలిక పేర్కొంది. బాలిక పేరంట్స్‌ను కూడా పిలిపించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన అధికారులు.. ఈ వ్యవహారంపై అంతర్గంతా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.