నేడు అమెజాన్ లో ‘షాదీ ముబారక్’

నేడు అమెజాన్ లో ‘షాదీ ముబారక్’

బుల్లితెర మెగాస్టార్ సాగర్ నాయుడు, దృశ్యా రఘునాథ్ జంటగా నటించిన చిత్రం ‘షాదీ ముబారక్’. తొలి చిత్రంతోనే దర్శకుడు పద్మశ్రీ ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “షాదీ ముబారక్” చిత్రాన్ని ఇటీవల విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. పెళ్లి, ప్రేమ అంశాలను కలబోసి ఈ సినిమాను ఆహ్లాదకరంగా అందించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎన్నారై మాధవ్ పాత్రలో సాగర్ నాయుడు, మ్యారేజ్ బ్యూరో నడిపించే సత్యభామగా దృశ్య రఘునాత్ నటించారు. ఈ చిత్రం నేటి నుంచి (మార్చి 25) అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నది. షాదీ ముబారక్” చిత్రానికి థియేటర్ ను మించిన రెస్పాన్స్ అమోజాన్ ప్రైమ్ లో వస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.