హీరోయిన్‌ కారుకు ప్రమాదం..తీవ్ర గాయాలు !

హీరోయిన్‌ కారుకు ప్రమాదం..తీవ్ర గాయాలు !

ప్రముఖ బాలీవుడ్‌ నటి షబానా ఆజ్మీకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కోల్హాపూర్‌ టోల్‌ప్లాజా సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు.. అదుపుతప్పి ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త జావేద్‌ అక్తర్‌ కూడా కారులోనే ఉన్నారు.