ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి

ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి

అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శేఖర్ రెడ్డి రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయారు. ఇంటి బిల్‌కు సంబంధించిన తప్పును సవరించడానికి శేఖర్‌రెడ్డి లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా వల పన్నిన అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.