కమల్ సినిమా రీమేక్ లో షారుక్!

కమల్ సినిమా రీమేక్ లో షారుక్!
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించి డైరెక్ట్ చేసిన చిత్రం 'హేరామ్'. 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎన్నో వివాదాలకు దారి తీసింది. స్వాతంత్ర్యం రావడానికి ముందు గల రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మహాత్మా గాంధీను నెగెటివ్ కోణంలో చూపించడంతో అప్పట్లో ఈ సినిమా ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అలానే రాణి ముఖర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు. అప్పట్లో తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. షారుక్ ఖాన్ ఈ సినిమా రీమేక్ హక్కులను కమల్ నుండి పొందినట్లు సమాచారం. కొన్ని మార్పులు చేసి సినిమా రూపొందించనున్నారు. అయితే ఈ సినిమాలో షారుక్ ఖాన్ నటిస్తారా..? లేక నిర్మాతగా సినిమా చేస్తారా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది.