చిన్నపిల్లాడిలా మారిన షారుక్...

చిన్నపిల్లాడిలా మారిన షారుక్...

గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ గెలుపు రేస్ లో వెనకబడ్డాడు.  బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు బోల్తా కొడుతున్నాయి.  వివరంగా చూసుకుంటే... ఖాన్ త్రయంగా చెప్పుకొనే సల్మాన్, అమీర్, షారుక్ ల చివరి సినిమాలు వరసగా ఫెయిల్ అయ్యాయి.  ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో సల్మాన్, ఆమిర్ ఖాన్ లు ప్రయత్నిస్తుంటే... షారుక్ మాత్రం ససేమిరా అంటున్నారు.  బిజినెస్ లో బిజీగా ఉన్న షారుక్, నెక్స్ట్ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.  

ప్రస్తుతం షారుఖ్ న్యూయార్క్ లో ఉన్నాడు.  ఎండల వేడి నుంచి తప్పించుకోవడానికి వాటర్ వరల్డ్ లాంటి కార్యక్రమాలకు హాజరయ్యి అక్కడ వాటర్ పార్క్ లో ఎంజాయ్ చేస్తు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.  మరోవైపు అమెరికన్ టెలివిజన్ హోస్ట్ డేవిడ్  లెటర్మన్ తో కలిసి నెట్ ఫ్లిక్స్ లో ఓ స్పెషల్ షో చేశారు.