డాడ్‌తో సుహాన సంద‌డి...

డాడ్‌తో సుహాన సంద‌డి...
సినిమాల వ్యాపారానికి ధీటుగా క్రీడా వ్యాపారం సాగుతోంది. `ఆట‌` నుంచి భారీగా కాసుల పిండుకునే కొత్త ఆట సాగుతోందిప్పుడు. క్రికెట్‌లో 20-20 ఫార్మాట్‌, ఐపీఎల్ ప్ర‌వేశంతో ఆటలో బిజినెస్‌ ప‌రాకాష్టలో ఉంది. ఈ త‌ర‌హా కాసుల వేట‌లో స్టారాధిస్టార్లు ఆరితేరిపోతున్న వైనం స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ క్రికెట్ లో పెట్టుబ‌డులు పెడుతూ సాగిస్తున్న ఆట ఎంతో ఇంట్రెస్టింగ్‌. ఓవైపు సినిమాతో బాక్సాఫీస్ వేట సాగిస్తున్న కింగ్‌ఖాన్ మ‌రోవైపు క్రీడల్లోనూ అంతే ఇదిగా కాసుల వేట సాగిస్తూ అజేయుడిగా నిలుస్తున్నాడు. ఫోర్బ్స్ 100 మంది జాబితాలో కింగ్ ఖాన్ స్థానం ప్ర‌తియేటా ఖాయం అవుతున్న తీరు చూస్తుంటే, అత‌డు సాధిస్తున్న గెలుపాట‌ ఏపాటిదో అర్థ‌మ‌వుతుంది. ఇదిగో నిన్న‌టిరోజున కోల్‌క‌త నైట్ రైడ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ్యాచ్‌లో కింగ్ ఖాన్ ఇలా ద‌ర్శ‌న‌మిచ్చారు. కెకెఆర్ టీమ్ వోన‌ర్‌గా ఆయ‌న ఆట‌కు బాస‌ట‌గా నిలిచారు. ఆ ప‌క్క‌నే అత‌డి వార‌సురాలు సుహానా ఖాన్ అంతే చిద్విలాసంగా న‌వ్వులు చిందిస్తూ క‌నిపించింది. డాడ్‌తో సుహానా సంద‌డిని కెమెరా క‌ళ్లు క్యాచ్ చేసి లైవ్‌లో చూపించ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి.