భారత ఆటగాళ్లు క్షమించమని అడుగుతారు...    

భారత ఆటగాళ్లు క్షమించమని అడుగుతారు...    

పాకిస్తాన్ మాజీ కెప్టెన్  షాహిద్ ఆఫ్రీది  భారత ఆటగాళ్ళు క్రికెట్లో తమ ప్రత్యర్థులపై ఓడిపోయిన తరువాత క్షమాపణ తెలుపుతారు అని పేర్కొన్నారు. టెస్ట్, వన్డే క్రికెట్‌లో భారత్‌పై పాకిస్తాన్ అత్యున్నత హెడ్-టు-హెడ్ రికార్డును కలిగి ఉంది.  టెస్టుల్లో ఇరు జట్లు 59 సార్లు పోటీపడగా, పాకిస్తాన్ 12 సార్లు విజయం సాధించగా, భారత్ 9 విజయాలు సాధించింది. 50 ఓవర్ల క్రికెట్‌లో ఈ తేడా మరింత పెద్దది, ఇందులో పాకిస్తాన్ తమ భారత్ పై 73-55 రికార్డును కలిగి ఉంది.  పాకిస్థాన్‌తో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన భారత్‌ టీ  20  ఫార్మాట్‌లో మాత్రమే ముందుంది. "నేను భారతదేశం మరియు ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా ఆడటం ఇష్టపడతాను  నేను వారికి వ్యతిరేకంగా ఆడినప్పుడు ఒత్తిడి ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. వారి సొంతగడ్డ పై వారికి వ్యతిరేకంగా బాగా రాణించడం నాకు పెద్ద విజయమే. అయితే ముందు ఎలా ఉన్న మ్యాచ్లో భారత జట్టు ఓడిపోతే వారు మా దగ్గరకు వచ్చి క్షమాపణలు అడుగుతారు'' అని ఆఫ్రీది  తెలిపాడు. ఇక గత నెలలో కరోనా బారిన పడిన ఆఫ్రీది  ఈ మధ్యే దాని నుండి బయటపడ్డాడు.