టీ 20ల్లో బాబర్ పనికిరాడు : ఆఫ్రీది 

టీ 20ల్లో బాబర్ పనికిరాడు : ఆఫ్రీది 

పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రీది ఇప్పటివరకు భారత ఆటగాళ్ల గురించి మాట్లాడి చిక్కులో పడ్డాడు. అందుకే ఇప్పుడు స్వయంగా తన దేశ ఆటగాళ్ల పైన పడుతున్నాడు. అయితే తాజాగా ఆఫ్రీది టీ 20ల్లో ప్రస్తుత పాక్ కెప్టెన్ బాబర్ పనికిరాడు అని తెలిపాడు. పాకిస్థాన్ జట్టులో ఈ తరం ఆటగాళ్లలో ఎక్కువ పేరు సంపాదించుకున్న ఆటగాడు బాబర్ అజామ్. ఈ 25 ఏళ్ల పాక్ బాట్స్మెన్ అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తుండటంతో అతడిని ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో  పోలుస్తున్నారు, కానీ నాకు అది ఇష్టం లేదు అని బాబర్ చాలాసార్లు చెప్పాడు.  2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన బాబర్ ఇప్పటివరకు.. 26 టెస్టుల్లో 45.12 సగటుతో 1,850 పరుగులు, 74 వన్డేల్లో 54.18 సగటుతో 3,359 పరుగులు,  38 టీ20ల్లో 50.72 సగటుతో 1,471 పరుగులు చేసాడు. ఇక మొత్తం అన్ని కలిపి 6680 పరుగులు చేసాడు అందులో.. 16 శతకాలు. 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటువంటి ఆటగాడి గురించి  ఆఫ్రీది మాట్లాడుతూ... నేను అనుకుంటున్నాను టీ20ల్లో బాబర్ అజామ్ ఎక్కువ రోజులు రాణించలేడు, అతను ఆ ఫార్మటు కు పనికిరాడు. కానీ  వన్డే, టెస్టుల్లో మాత్రం అద్భుతంగా ఆడగలడు అని తెలిపడు. చూడాలి మరి ఈ విషయం పై బాబర్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది.