ఆఫ్రిదీ : సచిన్ మా బౌలర్ కు భయపడ్డాడు

ఆఫ్రిదీ : సచిన్ మా బౌలర్ కు భయపడ్డాడు

పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రీది, సచిన్ టెండూల్కర్ షోయబ్ అక్తర్ ను ఎదుర్కోవటానికి భయపడ్డాడని , అక్తర్ 9 సంవత్సరాల వాదనను సమర్థించాడు. అయితే తాను అక్తర్‌ కు భయపడుతున్నానని టెండూల్కర్ మాత్రం అంగీకరించాడు అన్ని తెలిపాడు. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అక్తర్ బంతులు ప్రతిపక్ష ఆటగాళ్ల మనస్సుల్లో భయాందోళనలు సృష్టించాయని  ఆఫ్రీది అన్నారు. 2011 లో అక్తర్ చేసిన వాదనకు తాను అండగా నిలుస్తున్నానని చెప్పారు. ఇక అక్తర్, తన ఆత్మకథ 'కాంట్రవర్షియల్లీ యువర్స్' లో టెండూల్కర్ తన వేగాన్ని ఎదుర్కోవటానికి భయపడ్డాడని పేర్కొన్నాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు టెండూల్కర్ కాళ్లు వణుకుతున్నట్లు తాను చూశానని, 2011 లో జరిగిన ప్రపంచ కప్ సందర్భంగా సచిన్ అప్పటి యువ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను చూసి కూడా భయపడ్డాడని ఆఫ్రీది  చెప్పాడు. అయితే నేను భయపడుతున్నాను అని సచిన్ ఒప్పుకోడు అని  ఆఫ్రీది అన్నాడు. ఇక 9 టెస్టు మ్యాచ్‌ల్లో 3 సార్లు టెండూల్కర్ వికెట్ అక్తర్ కులభించింది. అయితే ఆఫ్రీది ఇప్పటికే భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక చూడాలి మరి ఈ విషయం పై ఎవరు ఏ విధంగా స్పందిస్తారు అనేది.