అర్జున్ రెడ్డిని దించేసిన కబీర్ సింగ్

అర్జున్ రెడ్డిని దించేసిన కబీర్ సింగ్

అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో ఓ సంచలన చిత్రం.  ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో చెప్పక్కర్లేదు.  తెలుగు హిట్టైన ఈ సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.  ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవడ్ కబీర్ సింగ్ కు దర్శకత్వం వహిస్తున్నారు.  

విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ ను అచ్చు అలాగే దించేశాడు షాహిద్ కపూర్.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  కబీర్ సింగ్ టీజర్ చేస్తుంటే బాలీవుడ్ లో మరో అర్జున్ రెడ్డిని చూసినట్టుగానే అనిపిస్తోంది.  హీరోయిన్ గా మహేష్ బాబు హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది.  జూన్ 21 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.