విజయ్ పై ప్రశంసలు కురిపించిన షాహిద్ కపూర్

విజయ్ పై ప్రశంసలు కురిపించిన షాహిద్ కపూర్

టాలీవుడ్ అర్జున్ రెడ్డి సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  కలెక్షన్లను పక్కన పెడితే.. యూత్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది.  విజయ్ డిఫరెంట్ ఆటిట్యూడ్ తో చెలరేగిపోయి నటించాడు.  ఈ సినిమాను హిందీలో ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు.  షాహిద్ కపూర్ హీరో.  ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ హిందీ వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.  టి సీరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 21 న రిలీజ్ చేస్తారట.  

అర్జున్ రెడ్డి సినిమాను చూసిన షాహిద్ కపూర్ షాక్ అయ్యాడట.  విజయ్ ఆటిట్యూడ్ సూపర్బ్ గా ఉందని ప్రశంసించారు.  నటన పరంగా విజయ్ పరిణితి కనబరిచాడనని అన్నాడు.  రఫ్ గడ్డంతో విజయ్ బాగున్నాడని, సినిమాను ఒకటికి రెండు సార్లు చూసి విజయ్ లా మారేందుకు ప్రయత్నిస్తున్నట్టు సాహిద్ పేర్కొన్నాడు.  షాహిద్ పెంచిన గడ్డం చూసిన సందీప్ రెడ్డి వంగ, ఇంకా కొంచెం గడ్డం పెంచాలని చెప్పాడట.  సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.  మరి హిందీలో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.