ఆ ఒక్క రీజన్ తోనే కబీర్ సింగ్ చేశారట..!!

ఆ ఒక్క రీజన్ తోనే కబీర్ సింగ్ చేశారట..!!

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా ప్రతి ఒక్కరికి నచ్చింది.  యూత్ కు ఆ సినిమా ఒక ఐకాన్ లా మారింది.  కొన్నిరోజులపాటు అర్జున్ రెడ్డి మానియా అలా కొనసాగింది.  ఈ మూవీని బాలీవుడ్ లో తీసేందుకు సందీప్ రెడ్డి వంగ షాహిద్ కపూర్ ను కలిశాడు.  అర్జున్ రెడ్డి సినిమాను చాలా సార్లు చూసిన షాహిద్ ఆ సినిమాకు న్యాయం చేయలేనేమో అనుకున్నా.. సందీప్ దర్శకుడు కాబట్టి ఒకే చేశాడు.  

తరువాత కబీర్ సింగ్ నిర్మాత షాహిద్ తో.. సందీప్ సినిమా చేయడం లేదు.. తనకు వేరే ఫిలిం ఉంది అని చెప్పడంతో షాహిద్ ఆలోచనలో పడ్డాడట.  అయితే, అదృష్టవశాత్తు ఆ సినిమా పోస్ట్ ఫోన్ కావడంతో.. కబీర్ సింగ్ ను డైరెక్ట్ చేసేందుకు సందీప్ ఒకే చెప్పాడట.  ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాహిద్ కపూర్ మీడియాతో పేర్కొన్నాడు.