కబీర్ సింగ్ గా రాబోతున్న అర్జున్ రెడ్డి

కబీర్ సింగ్ గా రాబోతున్న అర్జున్ రెడ్డి

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి ఎలాంటి ట్రెండ్ ను సెట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  యూత్ లో ఈ సినిమా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది.  అర్జున్ రెడ్డి తరువాత.. ఆ క్రేజ్ ను సొంతం చేసుకోవడానికి అనేక సినిమాలు వచ్చాయి.  అందులో కొన్ని విజయం సాధించాయి.  ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.  

బాలీవుడ్ లో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు,  ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగనే హిందీ వర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.  బాలీవుడ్ వెర్షన్ సినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 21 న రిలీజ్ అవుతున్నది.