డాన్ 3 కోసం సిద్ధం అవుతున్న షారుఖ్..!!

డాన్ 3 కోసం సిద్ధం అవుతున్న షారుఖ్..!!

బాలీవుడ్ లో హిట్ సినిమాల సీక్వెల్ లు వరసగా వస్తున్నాయి.  ధూమ్ సీరీస్ లో మూడు సినిమాలు వచ్చాయి.  అటు రేస్ సీరీస్ లో మూడు సినిమాలు వచ్చాయి.  ఇప్పుడు డాన్ సీరీస్ లో మూడో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  హౌస్ ఫుల్ లో మూడు సీరీస్ లు కంప్లీట్ చేసుకొని నాలుగో సీరీస్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.  

డాన్ సీరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  రెండింటిలోనూ షారుక్ హీరో.  ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ఈ సీరీస్ సినిమాలకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి.  మొదటి సినిమా డాన్ రూ.35 కోట్ల రూపాయల బడ్జెట్ తో 2006 లో తెరకెక్కింది.  రెండో సినిమా డాన్ 2 రూ.76 కోట్ల రూపాయల బడ్జెట్ తో 2011 లో తెరకెక్కింది.  ఇప్పుడు డాన్ 3 సినిమా 2019లో సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఈ సినిమాకు కూడా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా బడ్జెట్ ఎంత.. ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారట.