కరేబియన్ దీవుల్లో షారుక్ లుంగీ డ్యాన్స్...!! 

కరేబియన్ దీవుల్లో షారుక్ లుంగీ డ్యాన్స్...!! 

షారుక్ చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో లుంగీ డ్యాన్స్ సాంగ్ ఉన్నది.  అందులో షారుక్ లుంగీ కట్టుకొని చేసిన స్టెప్స్ అదరహో అనిపిస్తాయి.  చెన్నై ఎక్స్ ప్రెస్ నేపథ్యంలో తమిళనాడులో జరిగే సినిమా కావడంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.  ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాదు.. సౌత్ వాళ్ళను కూడా సినిమా మెప్పించింది.  ముఖ్యంగా రజినీకాంత్ ఫ్యాన్స్ ను ఈ సాంగ్ మెప్పించింది.  

ఆ తరువాత ఈ సాంగ్ కు చాలాసార్లు షారుక్ డ్యాన్స్ చేశారు.  వివిధ వేడుకల్లో షారుక్ డ్యాన్స్ చేయడం విశేషం.  తాజాగా షారుక్.. కరేబియన్ దీవుల్లో ఈ సాంగ్ కు డ్యాన్స్ చేయడం జరిగింది.  షారుక్ ఎందుకు డ్యాన్స్ చేశారు... కారణం ఏంటి అంటే.... ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో ఐపీఎల్ లాగానే కరేబియన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.  ఈ లీగ్ మ్యాచ్ లో షారుక్ కు చెందిన ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు వరసగా మూడు విజయాలు నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నది.  దీంతో షారుక్ జట్టు సభ్యులను ఉత్సాహ పరిచేందుకు ఓ పడవను అద్దెకు తీసుకొని నైట్ టైం లో సముద్రంలో ఇలా లుంగీ డ్యాన్స్ చేస్తూ పార్టీ చేసుకున్నారు.  షారుక్ లుంగీ డ్యాన్స్ ఇప్పుడు అక్కడ బాగా హైలైట్ అయ్యింది.