షారుక్ జీరోలో సల్మాన్ సందడి

షారుక్ జీరోలో సల్మాన్ సందడి

రంజాన్ సందర్భంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కావడం, ఫస్ట్ లుక్ లేదంటే టీజర్లు రిలీజ్ చేయడం జరుగుతుంటాయి.  రంజాన్ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు రంగరంగవైభోగంగా జరుపుకుంటారు.  ఇక ఈ పండుగ సినిమా వాళ్లకు కూడా పెద్ద పండుగే అని చెప్పొచ్చు.  రంజాన్ సందర్భంగా షారుక్ ఖాన్ జీరో సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.  ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేసిన ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

ఫ్యాన్స్ కేరింతల మధ్య ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.  చిన్న పిల్లవాడు ఉండేంత ఎత్తులో ఉన్న షారుక్ ఖాన్ ఎంటర్ అవుతాడు.  అందరు ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నారో.. ఆటను ఇప్పుడు రాబోతున్నాడు అనే బ్యాగ్రౌండ్ వాయిస్ వస్తుంది.  అంతలో సైజ్ చిన్నగా ఉన్న షారుక్ వెనక భారీ ఆకృతిలో ఉన్న సల్మాన్ ఖాన్ నిలబడతాడు.  ఇద్దరు చేతులు కలిపి ఫ్యాన్స్ మధ్య డ్యాన్స్ చేస్తారు.  ఫ్యాన్స్ ఖాన్ ద్వయంతో చేసిన జీరో టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది.  షారుక్ ఇప్పటి వరకు చేయని పాత్రలో కనిపించడం విశేషం.