ఆ రీమేక్ లో షారుక్ నటించడంలేదట

ఆ రీమేక్ లో షారుక్ నటించడంలేదట

బాలీవడ్ బాద్షా షారుక్ ఖాన్ జీరో పరాజయం తరువాత తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి అనే విషయం ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. డాన్ 3 సినిమా చేస్తున్నారనే వార్తలు వచ్చినా వాటిపై ఇప్పటి వరకు నిర్ధారణ లేదు.  

తమిళంలో సూపర్ హిట్టైన మెర్సల్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.  ఈ రీమేక్ లో షారుక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.  దీనిపై షారుక్ అండ్ కో స్పందించింది.  ఈ రీమేక్ లో షారుక్ చేయడం లేదని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.