షారుక్ ను చూడకపోయినా.. గొంతు వినొచ్చు..!!

షారుక్ ను చూడకపోయినా.. గొంతు వినొచ్చు..!!

వరసగా రెండు సినిమాలు ప్లాప్ కావడంతో.. షారుక్ ఇబ్బందుల్లో పడ్డారు. ఇంతవరకు మరో సినిమాను ప్రకటించలేదు.  దర్శక నిర్మాతలు కథలు వినిపిస్తున్నా.. షారుక్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.  అలాంటి వారికోసం ఓ శుభవార్తను తీసుకొచ్చింది డిస్ని సంస్థ.  

1994 వ సంవత్సరంలో డిస్ని సంస్థ ది లయన్ కింగ్ సినిమాను నిర్మించింది.  ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  అంతకు ముందు డిస్ని నిర్మించిన జంగిల్ బుక్ సినిమాను 2016 లో రీమేక్ చేసి రిలీజ్ చేసింది.  ఆ సినిమా సూపర్ హిట్టైంది.  1994లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమాను ఇప్పుడు రీమేక్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.  

ఈ సినిమా బాలీవుడ్ లో డబ్బింగ్ అవుతున్నది.  ఇందులో సింహం ముప్పా, సింబా పాత్రలకు డబ్బింగ్ కోసం షారుక్, ఆర్యన్ లను సంప్రదించారట.  డిస్నివచ్చి అడిగితె ఎలా కాదంటారు.  వెంటనే ఒకే చెప్పేశారు.  సినిమాల్లో కనిపించి చాలా కాలమైనా.... ది లయన్ కింగ్ లో షారుక్ వాయిస్ ని సొంతోషపడొచ్చు.