బంగ్లా బ్యాట్సమన్‌ పరుగుల ప్రవాహం..

బంగ్లా బ్యాట్సమన్‌ పరుగుల ప్రవాహం..

దక్షిణాఫ్రికాపై 75, న్యూజిలాండ్‌పై 64, ఇంగ్లాండ్‌పై 121, వెస్టిండీస్‌పై 124 నాటౌట్‌.. ఇవీ ఇప్పటి వరకు ఈ ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్సమన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ చేసిన స్కోర్లు. దుమ్ము రేపే ఫామ్‌లో ఉన్న ఈ హార్డ్‌ హిట్టింగ్ బ్యాట్సమన్‌ స్టార్‌ బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లను చిత్తు చేసిన బంగ్లా జట్టులో షకీబ్‌దే కీలక పాత్ర. కెరీర్‌లోనే పీక్‌ స్టేజ్‌లో ఉన్న షకీబ్‌ అల్‌ హసన్‌.. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు టోర్నీలో 5 వికెట్లు తీసిన షకీబ్‌.. మున్ముందు మరిన్ని అత్యత్తమ ప్రదర్శనలిస్తానని చెబుతున్నాడు. షకీబ్‌ సూపర్‌ ఫామ్‌ కంటిన్యూ అయితే.. బంగ్లాదేశ్‌ సెమీస్‌కు చేరినా చేరొచ్చు..!