నా కెప్టెన్ గంభీర్ : షకీబ్ 

నా కెప్టెన్ గంభీర్ : షకీబ్ 

బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్ ప్రస్తుతం అన్ని రకాల క్రికెట్ల నుండి రెండేళ్ల నిషేధం అనుభవిస్తున్నాడు. అయితే ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అతను ఇప్పటివరకు ఆడిన టీమ్స్ లోని ఆటగాళ్లతో కూడిన తన ఐపీఎల్ ఎలెవన్ జట్టును ఎంచుకున్నాడు. షకీబ్ తన 8 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. అయితే డేవిడ్ వార్నర్, రాబిన్ ఉతప్ప ను ఓపెనర్లుగా తీసుకున్నషకీబ్‌ తన జట్టుకు కెప్టెన్ గా మరియు 3 స్థానంలో బ్యాటింగ్ చేయడానికి భారత మాజీ ఓపెనర్, కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ను ఎనుకున్నాడు. మనీష్ పాండేను నాలుగో స్థానం లో తీసుకున్న తరువాత  5 వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి తనను తానే స్వయంగా ఎంచుకున్నాడు. ఆ తరువాత యూసుఫ్ పఠాన్ మరియు ఆండ్రీ రస్సెల్లను జట్టులోని ఇద్దరు ఆల్ రౌండర్లుగా అలాగే  వెస్టిండీస్ స్టార్ సునీల్ నరైన్‌ను మాత్రమే స్పిన్నర్‌గా ఎంపిక చేశాడు. ఇక పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ, ఉమేష్ యాదవ్ ముగ్గురిని తీసుకున్నాడు. 

షకీబ్ అల్ హసన్ ఐపీఎల్ ఎలెవన్ : డేవిడ్ వార్నర్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్ (సి), మనీష్ పాండే, షకీబ్ అల్ హసన్, యూసుఫ్ పఠాన్, ఆండ్రీ రుసెల్, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ, ఉమేష్ యాదవ్.