మహమ్మద్ షమీ ఔట్

మహమ్మద్ షమీ ఔట్

ఆఫ్గానిస్థాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌కి ఇండియాకు మరో షాక్ తగిలింది. టీం ఇండియా జట్టు నుంచి ఇప్పటికే ఫిట్ నెస్ లేని కారణంగా విరాట్ కోహ్లీ, కీపర్ వృద్దిమాన్ సాహా దూరమయ్యారు. తాజాగా పేసర్ మహ్మద్ షమీ కూడా ఈ టెస్ట్ మ్యాచ్‌కి దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించి ఫిట్‌నెస్ టెస్టులో షమీ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈ సిరీస్‌ కోసం ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల నుంచి షమీ పేరును తొలగించారు. అతని స్థానంలో నవదీప్ సైనీని జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. గతంలో సౌతాఫ్రికా పర్యటనలో సైనీ భారత్ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. కానీ అప్పుడు అతనికి ఆడే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌కి కోహ్లీ స్థానంలో కెప్టెన్‌గా అజింక్యా రహానే, సాహా స్థానంలో కీపర్‌గా దినేశ్ కార్తీక్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు.