వలస కార్మికులకు సహాయం చేస్తున్న భారత పేసర్...

వలస కార్మికులకు సహాయం చేస్తున్న భారత పేసర్...

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన స్వస్థలమైన ఉత్తర ప్రదేశ్‌లో ఆహార పంపిణీ స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయం చేస్తూనే ఉన్నాడు.షమీ ఉత్తరప్రదేశ్‌లోని జాతీయ రహదారి 24 వెంట మాస్కులు, ఆహారాన్ని పంపిణీ చేయడానికి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే తన నివాసం వెలుపల ఆహార పంపిణీ దుకాణాన్ని కూడా ఏర్పాటు చేశాడు. రోడ్డు మార్గంగా తమ స్వగ్రామాలకు వెళ్లే వలస కార్మికులకు షమీ ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసే వీడియోను ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. అయితే కరోనావైరస్ వ్యాప్తితో పోరాడటానికి దేశానికి సహాయం చేయడంలో అనేక మంది భారతీయ క్రీడా తారలు ముందుకు వచ్చారు. అయితే లాక్ డౌన్ లో ఆంక్షలు సడలించినప్పటికీ, వలస కార్మికులు దేశవ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారు. వారి జీవనోపాధి మాత్రమే కాదు, ప్రధాన నగరాల నుండి తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.