అచ్చంగా ఎన్టీఆర్ లానే...

అచ్చంగా ఎన్టీఆర్ లానే...

మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అనే నానుడు ఉంది.  ఇది చాలా వరకు నిజమనే చెప్పాలి.  ఎందుకంటే అప్పుడప్పుడు ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులు మనకు తారసపడుతుంటారు.  పేపర్లో, టీవీల్లో ఇలాంటి న్యూస్ వస్తూనే ఉంటుంది.  అంతెందుకు, ప్రధాని మోడీని పోలిన వ్యక్తి గురించి టీవీల్లో, పేపర్లో చాలామార్లు వచ్చింది.  

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను పోలిన వ్యక్తి గురించి న్యూస్ ఒకటి మీడియాలో కనిపించింది.  అచ్చు గుద్దినట్టు జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్న ఆ వ్యక్తి పేరు షమీందర్ సింగ్.  పంజాబ్ కు చెందిన వ్యక్తి.  ఇప్పటి వరకు హైదరాబాద్ రాలేదట.  దానికి కారణం లేకపోలేదు.  ఒకవేళ హైదరాబాద్ వస్తే.. తనను ఎన్టీఆర్ అనుకోని ఎక్కడ అభిమానులు గోలచేస్తారేమో అని చెప్పి రాలేదని అంటున్నాడు షమీందర్ సింగ్.