శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాదలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబయ్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 3.329 కిలోల బంగారన్ని గుర్తించిన అధికారులు.. స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.కోటికిపైగానే ఉంటుందని తెలిపారు. ఓ ప్రయాణీకుడు తన లోదుస్తులకు ప్రత్యేకంగా జేబును అమర్చుకుని.. అందులో బంగారు బిస్కెట్లు తీసుకురాగా.. తనిఖీల్లో పట్టుబడ్డాడు.