శంషాబాద్ భాదితురాలి పేరు మార్చిన పోలీసు అధికారులు

శంషాబాద్ భాదితురాలి పేరు మార్చిన పోలీసు అధికారులు

తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ గా పని చేస్తున్న యువతి అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలకే కాక ఢిల్లీ దాకా చేరి పెను ఉద్యమంలా మారింది. దేశవ్యాప్తంగా జస్టిస్ ఫర్ ప్రియాంకా రెడ్డి అంటూ వైరల్ అవుతున్న నేపథ్యంలో సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్భయ, అభయ పేర్లలాగా ఈ కేసులో మృతురాలి పేరును దిషాగా మార్చారు. ఇక ఆమె పేరు వాడకుండా ‘జస్టిస్ ఫర్ దిషా’గా పిలవాలని సీపీ సజ్జనార్ సూచించారు.

ఈ విషయంపై ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులతో చర్చించిన సజ్జనార్.. అందరూ కూడా ‘జస్టిస్ ఫర్ దిషా’కు సహకరించాలని కోరారు. నిజానికి సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం అత్యాచారానికి గురైన వారి ఫోటో గానీ, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు, ఫోటోలు గానీ, నిందితుల ఫోటోలు గానీ మీడియా ప్రచురించకూడదు. అది నిర్భయ చట్టరీత్యా నేరం. అయితే శంషాబాద్ ఘటనలో మృతురాలి ఫోటో, పేరు దావానలంగా వ్యాపించింది. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. దీంతో.. తాజాగా ఆమె పేరును ‘దిశ’గా మార్చుతూ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి ఆమెను దిశగా పిలవాలని, జస్టిస్ ఫర్ దిశగా వ్యవహరించాలని సూచించారు. మీడియా కూడా అసలు పేరుకు బదులు జస్టిస్ ఫర్ దిశగా పిలవాలని చెప్పారు.