ఐసీసీ ర్యాంకింగ్స్: కెరియర్లో అత్యుత్తమ స్థానాలకు వచ్చిన షాన్, ఆలీ పోప్

ఐసీసీ ర్యాంకింగ్స్: కెరియర్లో అత్యుత్తమ స్థానాలకు వచ్చిన షాన్, ఆలీ పోప్

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్ట్ మొదటి మ్యాచ్ లో రెండు జట్ల ఆటగాళ్లు రాణించడంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో తమ కెరియర్లోనే అత్యుత్తమ స్థానాలకు వచ్చారు. మొదటి టెస్టులో పాకిస్తాన్ బ్యాట్స్మాన్ షాన్ మసూద్ సెంచరీ సాధించడంతో టెస్ట్ బ్యాటింగ్ విభాగం లో 19 వ స్థానానికి వచ్చాడు. వోక్స్ ఇప్పుడు బ్యాట్స్మెన్ జాబితాలో 78 వ స్థానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్ విజయంలో జోస్ బట్లర్‌తో కలిసి ఆరో వికెట్ కు 139 పరుగులు జోడించడంతో 18 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. అలాగే ఆల్ రౌండర్ల జాబితాలో ఏడవ స్థానానికి వచ్చాడు. బట్లర్  44 వ నుండి 30 వ స్థానానికి రాగ, ఆలీ పోప్ కెరీర్-బెస్ట్ గా 36 వ స్థానాన్ని సాధించాడు.

బౌలర్ల జాబితాలో, పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్లు యాసిర్ షా మ్యాచ్ లో 8 వికెట్లలు సాధించడంతో 22 వ స్థానానికి చేరుకున్నాడు. షాదాబ్ ఖాన్ కెరీర్-బెస్ట్ 69 వ స్థానంలో నిలిచాడు. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో, ఇంగ్లాండ్ 266 పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకుంది. అయితే 360 పాయింట్లతో భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది, 296 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో, న్యూజిలాండ్ 180 పాయింట్లతో నాల్గవ స్థానంలో, పాకిస్తాన్ 140 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి.