సామ్సన్ ను బ్లూ జర్సీలో చూడాలనుకుంటున్నాను : షేన్ వార్న్

సామ్సన్ ను బ్లూ జర్సీలో చూడాలనుకుంటున్నాను : షేన్ వార్న్

ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సంజు సామ్సన్ పై ప్రశంశలు కురిపించాడు. ఐపీఎల్ 2020 లో రాజస్థాన్ రాయల్స్ తమ ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. రాజస్థాన్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఆడి 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇందులో ఆర్ఆర్ కీపర్-బ్యాట్స్మాన్ సామ్సన్ 32 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. అయితే సామ్సన్ ఆట పై  రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్ షేన్ వార్న్ మాట్లాడుతూ... సంజు సామ్సన్ వంటి ప్రతిభగల ఆటగాడు మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో ఆడాలి. కానీ అతను టీమ్ ఇండియాలో భాగం కాదని తెలిసి తాను షాక్ ఆయను అని అన్నారు. సామ్సన్ ఎటువంటి ఆటగాడో నాకు తెలుసు. నేను అతడిని చాలా కాలం నుండి చూస్తున్నాను అని రాయల్స్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో వార్న్ అన్నారు. అతను ఒక సంపూర్ణ ఛాంపియన్, అతను అన్ని షాట్లు ఆడగలడు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడంలో అతను బాగా సహాయపడుతాడు. నేను అతడిని బ్లూ జర్సీలో చూడాలని ఆశిస్తున్నాను అని వార్న్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌ మ్యాచ్ లో సామ్సన్ తన అర్ధ శతకాన్ని కేవలం 19 బంతుల్లోనే పూర్తి చేశాడు. అయితే ఈ రోజు షార్జాలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో రాజస్థాన్ తమ 2వ మ్యాచ్ ఆడనుంది. చూడాలి మరి అందులో సామ్సన్ ఎలా రాణిస్తాడు అనేది.