రక్తమోడుతూనే వాట్సన్ బ్యాటింగ్
ముంబైతో జరిగిన ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ ఒంటరి పోరాటం చేసి జట్టును గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు. చివర్లో వాట్సన్ రనౌట్ అవడంతో మ్యాచ్ ముంబైకి అనుకూలంగా మారింది. ఐతే.. వాట్సన్‌కు సంబంధించిన ఓ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసే సమయంలో వాట్సన్ మోకాలి వద్ద గాయమైంది. కానీ.. మేనేజ్మెంట్కి చెప్పకుండా ఆ గాయంతోనే అతను మ్యాచ్‌లో కొనసాగాడు. గాయం తీవ్రత పెరిగినా జట్టు కోసం పోరాడాడు. రక్తమోడుతున్నా ఎవరికీ చెప్పకుండానే బ్యాటింగ్ కొనసాగించాడు. గాయానికి సంబంధించిన రక్తంతో వాట్సన్ ఫ్యాంట్ కొంత భాగం తడిచిపోయినా గ్రౌండ్‌ను వదల్లేదు. ఉత్కంఠగా సాగడంతో మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఈ గాయాన్ని కూడా ఎవరూ చూడలేదు.
చెన్నై టీమ్ మేట్ హర్భజన్ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ వాట్సన్ పోరాటపటిమను మెచ్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం వాట్సన్ గాయానికి ఆరు కుట్లు పడ్డాయని భజ్జీ చెప్పాడు.
Is that really blood ???
— Pathan Usif (@Pathan4141) May 13, 2019
????????
O god
Why did no one ask him or talk about it
Not even one from onfield and comemtators ???
Seen in that he injured got 6 stitches after match
Didnt tell anyone and played his best #Legend@ChennaiIPL #Watson @ShaneRWatson33
???????? pic.twitter.com/IyIuu814bu
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)