ఆటోలో విహరించిన షేన్ వాట్సన్

ఆటోలో విహరించిన షేన్ వాట్సన్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో వీరవిహారం చేసి చివరకు రసవత్తరంగా ముగియడానికి కారణమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. మే 12న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో వాట్సాన్ ఆడిన తీరు అంతటా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ముగిసిన తరువాత ఆటగాళ్లకు కాస్తంత విరామం దొరికినట్లైంది. దీంతో చెన్నైలో షికార్లు కొడుతున్నారు. ఇందులో భాగంగా వాట్సన్ తన కుటుంబంతో కలిసి ఆటోలో చెన్నైలో విహరించాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.