శంకర్ చూపులన్నీ చైనా మీదనే..!!

శంకర్ చూపులన్నీ చైనా మీదనే..!!

రజినీకాంత్.. శంకర్ కాంబినేషన్లో వచ్చిన 2పాయింట్ 0 సినిమా చైనా మినహా ప్రపంచంలోని మిగతా దేశాల్లో రిలీజ్ అయ్యింది.  3డి, 2డి ఫార్మాట్ లో రిలీజైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 10500 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది.  మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా చైనాలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది.  జులై 12 వ తేదీన సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా.. డిస్ని ది లయన్ కింగ్ సినిమా రిలీజ్ అవుతుండటంతో.. ఈ మూవీని వాయిదా వేశారు.  

ఇదిలా ఉంటె, సెప్టెంబర్ 6 వ తేదీన సినిమాను చైనాలో రిలీజ్ చేయబోతున్నారు.  ఒకటికాదు రెండు కాదు ఏకంగా 40వేల స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఒక ఇండియన్ సినిమా ఈ స్థాయిలో చైనాలో రిలీజ్ చేస్తున్నారంటే మాములు విషయం కాదు.  ఇది రికార్డ్ అని చెప్పాలి.  ప్రపంచ వ్యాప్తంగా 10500 స్క్రీన్స్ లో రిలీజైతే.. ఒక్క చైనాలోనే దానికి నాలుగు రెట్లు ఎక్కువ స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అవుతుండటం విశేషం.  ఇప్పుడు శంకర్ చూపులన్నీ చైనామీదనే ఉన్నాయి.