శంకర్ దృష్టి మొత్తం దానిమీదే..!!

శంకర్ దృష్టి మొత్తం దానిమీదే..!!

శంకర్.. 2పాయింట్ 0 తరువాత కమల్ తో భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా జనవరి 18 నుంచి షూటింగ్ జరుపుకోబోతున్నది.  భారతీయుడు సినిమాకు ఇది కొనసాగింపు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను శంకర్ నిన్న రిలీజ్ చేశాడు.  భారతీయుడు సినిమాలో కమల్ డబుల్ రోల్ ప్లే చేశారు.  ఒకటి సేనాపతి పాత్ర కాగా, రెండోది బోసు పాత్ర.  

అవినీతితో కూడుకున్న బోసును సేనాపతి చంపేస్తాడు.  భారతీయుడు 2 లో సేనాపతి ఒక్కరే ఉంటాడు.  సేనాపతిని పట్టుకునే పాత్రలో కాజల్ కనిపిస్తోంది.  ఈ సినిమా ఎక్కువ భాగం మర్మకళ చుట్టూనే తిరుగుతుంది.  మర్మకళలో ఆరితేరిన వ్యక్తిగా సేనాపతి కనిపించబోతున్నాడు.  కాజల్ ను 50 సంవత్సరాల వృద్ధురాలిగా కనిపిస్తోంది.  మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.