కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనం..! శరద్ పవార్ ఏమన్నారంటే..

కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనం..! శరద్ పవార్ ఏమన్నారంటే..

మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. షోలాపూర్‌లో జరిగిన ఎన్సీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న షిండే.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో ఎన్సీపీ విలీనమౌతుందన్నారు. షిండే వ్యాఖ్యలు రెండు పార్టీల్లో చర్చనీయాంశంగా మారడంతో.. శరద్ పవార్ స్పందించారు.  షిండే ఆయన పార్టీ కాంగ్రెస్ గురించి ఏమైనా చెప్పుకోవచ్చని, కానీ ఎన్సీపీ అధినేతగా తమ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాదని స్పష్టంగా చెప్పగలనని అన్నారు పవార్. అయితే మహారాష్ట్ర ఎన్నికల తరుణంలో.. షిండే విలీన వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయంపై చర్చ జరుగుతోంది. రెండు పార్టీలు విలీనమై పోరాడితే తప్ప.. బీజేపీని ఎదుర్కోలేమనే ఉద్దేశంతో అన్నారా అనే వాదన కూడా తెరపైకి వచ్చింది.