'మహా' ఉత్కంఠ..! మోడీతో శరద్ పవార్ భేటీ

'మహా' ఉత్కంఠ..! మోడీతో శరద్ పవార్ భేటీ

హస్తినలో హీట్ పెంచుతోంది మహారాష్ట్ర రాజకీయం.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మహారాష్ట్రలోని రైతు సమస్యలపై మాట్లాడేందుకే భేటీ అని చెబుతున్నా... ప్రభుత్వ రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుపై పవార్ మనస్సులో ఏముందో ఎవరికీ అంతుపట్టడంలేదు. ఎన్సీపీని, శరద్ పవార్‌ను ప్రధాని మోడీ ప్రశంసించిన 24 గంటల్లోనే ఈ ఇద్దరి భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు మోడీని పవార్ కలవడంతో శివసేన కూడా అలర్ట్ అయ్యింది. ముంబై రావాల్సిందిగా ఎమ్మెల్యేలందరినీ ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటుపై రేపటిలోగా క్లారిటీ వస్తుందని శివసేన నేత సంజయ్ రౌతు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం సోనియాతో సమావేశం ఉండగా... ఈలోపే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై ఉత్కంఠగా మారింది.