లాభాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల్లో ప్రారంభ‌మైన నిఫ్టి

అమెరికా మార్కెట్లకు అనుగుణంగా మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మ‌య్యాయి. ప్రస్తుతం నిఫ్టి 45 పాయింట్ల లాభంతో  11,300 ప్రాంతంలో నిఫ్టి ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ట్రేడ‌వుతుండ‌గా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ లాభాల్లో ఉండ‌గా, చైనా మార్కెట్లు న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్నా..  నిల‌క‌డ‌గా ఉన్నాయి. డాల‌ర్‌తో రూపాయి స్థిరంగా ఉంది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కోల్ ఇండియా, ఇండియా బుల్స్ హౌసింగ్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి. నిఫ్టి టాప్ లూజ‌ర్స్‌లో బీపీసీఎల్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌, హిందాల్కో, స‌న్ ఫార్మా, సిప్లా షేర్లు ఉన్నాయి.  

బీఎస్ఈ సెన్సెక్స్ షేర్లలో రిల‌య‌న్స్ ఇన్‌ఫ్రా, రిల‌య‌న్స్ నిప్పాన్‌, ఎస్ బ్యాంక్‌, రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌, మ‌ణ్ణపురం ఫైనాన్స్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి.

ఇక సెన్సెక్స్ టాప్ లూజ‌ర్స్‌లో ఉన్న షేర్లు... బ్లూడార్ట్‌, అర‌బిందో ఫార్మా, పీఎన్‌బీ హౌసింగ్‌, మిందా ఇండ‌స్ట్రీస్‌, టేక్ సొల్యూష‌న్స్ ఉన్నాయి.