లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ గ‌డువు ఇవాళ్టితో ముగియ‌నుంది. నిఫ్టిపై మాత్రం ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి ఒత్తిడి రాలేదు. ఇవాళ కూడా ఓపెనింగ్‌లో స్వల్ప లాభాల‌తో మొద‌లైంది. ఇపుడు 33 పాయింట్ల లాభంతో 11,478 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిన్న యూరో మార్కెట్లు మిశ్రమంగా క్లోజ్‌ కాగా, అమెరికా మార్కెట్లు న‌ష్టాల్లో ముగిశాయి. అమెరికా సూచీలన్నీ అర శాతంపైగా త‌గ్గాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు రాత్రి బాగా క్షీణించాయి. అంత‌ర్జాతీయ వృద్ధి రేటు మంద‌గిస్తోంద‌న్న ఆందోళ‌న స్టాక్ మార్కెట్‌లో పెరుగుతోంది. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ట్రేడ‌వుతున్నాయి. వ‌రుస‌గా మూడో రోజు జ‌పాన్ మార్కెట్ భారీ న‌ష్టాల‌తో ట్రేడవుతోంది. నిక్కీ 1.5 శాతంపైగా న‌ష్టంతో ఉంది. ఇటీవ‌లి కాలంలో నిక్కీ వ‌రుస‌గా భారీ న‌ష్టాల‌తో ట్రేడ‌వ‌డం ఇదే మొద‌టిసారి. హాంగ్‌సెంగ్‌లో పెద్ద మార్పులు లేవు. చైనా మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న నిఫ్టి ఎంత కాలం పై స్థాయిలో నిల‌దొక్కుకుని ఉంటుంద‌నే టెన్షన్ ఇన్వెస్టర్లలో ఉంది. నిఫ్టి ప్రధాన షేర్ల‌లో హెచ్‌సీఎల్ టెక్‌, అదానీ పోర్ట్స్‌, టెక్ మ‌హీంద్రా, టీసీఎస్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా నిలిచాయి. ఇక టాప్ లూజ‌ర్స్‌...ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, ప‌వ‌ర్ గ్రిడ్ ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయిన‌ర్స్‌గా శంక‌ర నేత్రాల‌య‌, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్‌, ఇండియా బుల్స్, టేక్ సొల్యూష‌న్స్‌, శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌లో ఆర్ కామ్‌, జెట్ ఎయిర్‌వేస్‌, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ ఉన్నాయి.