మళ్ళీ భారీ నష్టాల్లో నిఫ్టి

మళ్ళీ భారీ నష్టాల్లో నిఫ్టి

లాభాలు ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోయాయి. ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైన నిఫ్టి ఒకదశలో భారీ లాభాలకు చేరుకున్నా... ఎంత స్పీడుగా పెరిగిందో.. .అంతే స్పీడుతో పతనమైంది. మిడ్ సెషన్‌లో యూరో మార్కెట్లు లాభాల్లో నుంచి నష్టాల్లోకి మారడంతో నిఫ్టి కూడా నష్టాల్లోకి జారుకుంది. ఉదయం నిఫ్టి 11,271 పాయింట్ల వద్ద ప్రారంభమై 11,286 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. కాని ఆ స్థాయిలో ఎంతో సేపు నిలదొక్కుకోలేకపోయింది. అక్కడి నుంచి ఏకంగా 11,136 పాయింట్లకు పడిపోయి... క్లోజింగ్‌లో కాస్త కోలుకుని 11,271 పాయింట్ల వద్ద 65 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇక యూరో దేశాలపై సుంకాలు వేసేందుకు అమెరికా సిద్ధమౌతోందన్న వార్తలతో ఆటో రంగానికి పలు షేర్లు భారీగా నష్టపోయాయి. టాటా మోటార్స్‌ ఏకంగా 7 శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇవాళ టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన షేర్లు ఇవి...  బజాజ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌ మోటార్స్‌, యూపీఎల్‌, బజాజ్ పిన్‌ సర్వీసెస్‌, ఐఓసీ. ఇక నిఫ్టిలో టాప్‌ లూజర్స్‌...  ఎస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌. ఇక బీఎస్‌ఇ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన షేర్లు... డీకాల్‌, టైమ్‌టెక్నో, స్పైస్‌ జెట్‌, టీటీకే ప్రీస్టేజ్‌, ఇమామి లిమిటెడ్‌. సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌... వాక్రంగి,  యూనియన్‌  బ్యాంక్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, డిష్‌ టీవీ, సుజ్లాన్‌.