భారీ లాభంతో ముగిసిన నిఫ్టి

భారీ లాభంతో ముగిసిన నిఫ్టి

డాలర్‌తో రూపాయి స్థిరంగా ఉండటంతో పాటు ముడి చమురు ధరలు మరింత క్షీణించడంతో నిఫ్టి వంద పాయింట్లు లాభపడింది. నిన్న అమెరికా మార్కెట్లు భారీగా క్షీణించగా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. జపాన్‌ నిక్కీ 2 శాతం క్షీణించినా.. భారత్‌తో సహా మిగిలిన కీలక మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 100 పాయింట్లు లాభపడి 10,582 వద్ద ముగిశాయి. 

ఫార్మా, రియల్ ఎస్టేట్‌ మినహా మిగిలిన రంగాల షేర్లు పెరిగాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఐషర్‌ మోటార్స్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌టీపీసీ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టాల్లో ముగిసిన షేర్లలో సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌, సిప్లా షేర్లు టాప్‌లో ఉన్నాయి. ముడిచమురు ధరలు బాగా తగ్గడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు బాగా లాభపడ్డాయి. అలాగే జెట్‌ ఎయిర్‌వేస్‌ 5 శాతం లాభపడగా.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7 శాతం క్షీణించింది. అలాగే అలహాబాద్‌ బ్యాంక్‌ కూడా 8 శాతంపైగా తగ్గింది.