లాభంతో ముగిసిన మార్కెట్‌

లాభంతో ముగిసిన మార్కెట్‌

కొత్త ఏడాది మార్కెట్‌ శుభారంభం చేసింది. నిఫ్టి 47 పాయింట్ల లాభంతో ముగిసింది. ఉదయం ఆరంభమైన కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి ఒకదశలో 10,807కు పడిపోయింది. మిడ్‌ సెషన్లో ఒక్కసారిగా అప్‌ట్రెండ్‌లోకి వచ్చింది. కొనుగోళ్ళ మద్దతు కారణంగా నిఫ్టి 10,910 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ఇవాళ దాదాపు అన్ని మార్కెట్లకు సెలవు. కమాడిటీ మార్కెట్లు కూడా 5 గంటలకే మన వద్ద క్లోజ్‌ కానున్నాయి. దీంతో రూపాయి కూడా కేవలం పది పైసల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి 32 షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి.

నిఫ్టి ప్రధాన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌ 3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2 శాతం లాభంతో క్లోజయ్యాయి. ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు కూడా ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నాలుగు శాతం క్షీణించింది. ఆటో రంగ అమ్మకాలు నిరుత్సాహకరంగా ఉండటమే దీనికి కారణం. హిందాల్కో, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హిందుస్థాన్‌ లీవర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సేర్లు ఒకశాతంపైగా నష్టంతో క్లోజయ్యాయి. ఇతర షేర్లలో  ఎంటీఎన్‌ఎల్‌ 20 శాతం లాభంతో ముగిసింది.