స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా.. మన మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. ఉదయం నుంచి హెచ్చుతగ్గులకు లోనైన నిఫ్టి 6 పాయింట్ల నష్టంతో ముగిసింది. మిడ్ సెషన్‌ తరవాత అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లలో పాక్షికంగా లాభాలు స్వీకరించారు. ఉదయం ఆసియా మార్కెట్లలో ఒక్క జపాన్‌ మాత్రం స్వల్ప లాభంతో ముగిసింది. ఇతర ఆసియా మార్కెట్లన్నీ భారీ నష్టాలతో ముగిశాయి. యూరో మార్కెట్లలో ప్రధాన మార్కెట్లన్నీ అరశాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో పీఎస్‌యూ బ్యాంకు షేర్ల సూచీ రెండు శాతం పైగా పెరగ్గా.. ఫార్మా, ఐటీ షేర్ల సూచీలు రెండు శాతంపైగా నష్టపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ కూడా ఒకటిన్నర శాతం నష్టపోయింది. 

నిఫ్టి ప్రధాన షేర్లలో భారీ లాభాలతో ముగిసిన షేర్లు వరుసగా.. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, యూపీఎల్‌, మారుతీ, ఐఓసీ షేర్లు ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో టాప్‌ లూజర్స్‌.. సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉన్నాయి. అశోక్‌ లేల్యాండ్‌ పది శాతంపైగా నష్టంతో ముగిసింది.