లాభాల్లో ముగిసిన నిఫ్టి

లాభాల్లో ముగిసిన నిఫ్టి

రోజంతా లాభాల్లో కొనసాగిన నిఫ్టి అత్యంత కీలకమైన 10750 పాయింట్ల పైన ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 81 పాయింట్ల లాభంతో 10763 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 317 పాయింట్ల లాభంతో క్లోజైంది. ఆర్బీఐ బోర్డు మీటింగ్‌ నేపథ్యంలో బ్యాంకు షేర్లు స్తబ్దుగా ట్రేడయ్యాయి. ప్రధాన షేర్లలో పెద్ద కదలికల్లేవు. ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఎఫ్‌ఎంసీజీ, ఆటోషేర్లు ఒకమోస్తరు లాభాలతో ముగిశాయి. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి బలపడింది. ముడి చమురు ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. నిఫ్టి షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, వేదాంత షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన ఎస్‌ బ్యాంక్‌ ఇవాళ ఏడు శాతంపైగా లాభపడింది. నిఫ్టి షేర్లలో.. నష్టాలతో ముగిసిన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌపింగ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు ఉన్నాయి. ఇతర షేర్లలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏడు శాతం నష్టపోగా.. ఆర్‌ కామ్‌ నాలుగు శాతం పెరిగింది.