భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

నిన్న‌టి లాభాల‌ను నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే కోల్పోయింది. అమెరికా, చైనాల మ‌ధ్య మ‌ళ్లీ మాటల యుద్ధం మొద‌లు కావ‌డంతో ఇవాళ ఆసియా మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. నిన్న ప్ర‌పంచ మార్కెట్ల‌కు సెల‌వు. హాంగ్ సెంగ్ సూచీ మూడు శాతం దాకా న‌ష్టంతో  ట్రేడ‌వుతుండ‌గా, ఇత‌ర సూచీలు ఒక శాతంపైగా న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి. వాణిజ్య డేటా కూడా నిరాశాజ‌న‌కంగా ఉండ‌టంతో.. ముడి చ‌మురు ధ‌ర‌లు న‌ష్టాలతో ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు భారీ న‌ష్టంతో ప్రారంభ‌మ‌య్యాయి. ఓపెనింగ్‌లో 70 పాయింట్ల‌కుపైగా న‌ష్ట‌పోయిన నిఫ్టి ప్ర‌స్తుతం 40 పాయింట్ల న‌ష్టంతో 10,870 పాయింట్ల వ‌ద్ద ట్రేడ‌వుతోంది.

ఆరంభంలో నిఫ్టిలో 50 షేర్ల‌లో కేవ‌లం మూడు మాత్ర‌మే గ్రీన్‌లో ఉన్నాయి. ఇపుడుకోలుకున్నాయి. మెట‌ల్‌, ఆటో షేర్ల సూచీలు ఒక శాతంపైగా న‌ష్టంతో ఉన్నాయి. నిన్న వెలువ‌డిన ఆటో మొబైల్ అమ్మ‌కాలు చాలా నిరుత్సాహ‌క‌రంగా ఉన్నాయి. దీంతో ఇవాళ చాలా ఆటో షేర్లు భారీ న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ముఖ్యంగా ఐష‌ర్ అయిదు శాతం దాకా న‌ష్ట‌పోయింది. ఐటీ షేర్ల సూచీ మాత్ర‌మే స్వ‌ల్పంగా గ్రీన్‌లో ఉంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టెక్ మ‌హీంద్రా టాప్ గెయిన‌ర్‌గా ట్రేడ‌వుతోంది. త‌రువాతి స్థానాల్లో విప్రో, ఇన్‌ఫ్రాటెల్‌, ఎస్‌బీఐ, టీసీఎస్ ఉన్నాయి. ఇక న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్న షేర్ల‌లో ఐష‌ర్ మోటార్స్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, టాటా స్టీల్ ఉన్నాయి.