లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల‌తో నిఫ్టి లాభాల‌తో ప్రారంభ‌మైంది. అమెరికా, చైనాల మ‌ధ్య వాణిజ్య చ‌ర్చలు ప్రారంభం కావ‌డంతో అమెరికా మార్కెట్లు భారీ లాభాల‌తో ముగిశాయి. అన్ని సూచీలు దాదాపు రెండు శాతం వ‌ర‌కు ల‌బ్ది పొందాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌దీ అదే ప‌రిస్థితి. భారీ లాభాల్లో ఉన్నాయి. ఉద‌యం డాల‌ర్‌తో రూపాయి ఏకంగా 20 పైస‌లు బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు కూడా లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. 10,690 వ‌ద్ద ప్రారంభ‌మైన నిఫ్టి 10,700 స్థాయిని దాటింది. ఇపుడు 40 పాయింట్ల లాభంతో ట్రేడ‌వుతోంది. ఇవాళ జ‌న‌వ‌రి నెల డెరివేటివ్ కాంట్రాక్ట్స్‌కు చివ‌రి రోజు. దీంతో మార్కెట్‌లో తీవ్ర హెచ్చుత‌గ్గుల‌కు అవ‌కాశ‌ముంది. అంత‌ర్జాతీయ మార్కెట్లు ఇదే స్థాయిలో లాభాలు కొన‌సాగితే మార్కెట్‌కు లాభాల అండ కొన‌సాగే అవ‌కాశ‌ముంది. రేపు తాత్కాలిక బ‌డ్జెట్ ఉన్న కార‌ణంగా మార్కెట్‌పై భిన్న అంచ‌నాలు వ‌స్తున్నాయి. చిన్న ఇన్వెస్ట‌ర్లు బ‌డ్జెట్ ట్రెండ్ స్ప‌ష్ట‌మ‌య్యే వ‌ర‌కు దూరంగా ఉండ‌టం మంచిది.

నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో టెక్ మ‌హీంద్రా, గెయిల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిల‌య‌న్స్‌, ఎస్‌బీఐ ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మళ్ళీ భారీ న‌ష్టాల‌తో ట్రేడ‌వుతోంది. త‌రువాతి స్థానంలో ఇండియా బుల్స్ హౌసింగ్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్ స‌ర్వ్‌, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. దీవాన్ హౌసింగ్ ఇవాళ మ‌రో ఏడు శాతం క్షీణించింది.