షాక్‌ తరువాత కోలుకున్న నిఫ్టి

షాక్‌ తరువాత కోలుకున్న నిఫ్టి

రోజంతా ఒక మోస్తరు లాభాలతో ఉన్న నిఫ్టి సరిగ్గా రెండు గంటలకు ఓ షాకిచ్చింది. గరిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 110 పాయింట్లు పడిపోయింది. తరువాత కొన్ని నిమిషాల్లోనే కోలుకుని దాదాపు 55 పాయింట్ల లాభంతో ముగిసింది. 2 గంటల ప్రాంతంలో 10,862 ఉన్న నిఫ్టి.. సరిగ్గా 2 దాటగానే పడుతూ వచ్చింది. కేవలం 20 నిమిషాల్లోనే 10,749కి పడిపోయింది. సెన్సెక్స్‌ కూడా అదే స్థాయిలో పడి లేచింది. 231 పాయింట్ల లాభంతో ముగిసింది సెన్సెక్స్‌. ఇవాళ మెటల్‌ షేర్ల సూచీ ఒక శాతం క్షీణించగా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఒక శాతం పెరిగాయి. ఇతర కీలక రంగాల షేర్ల సూచీలు స్థిరంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బక్యాంకుల్లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 

నిఫ్టి ప్రధాన షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఇవాళ మరో 3శాతం  పెరిగి 671కి చేరింది. తరవాతి స్థానాల్లో ఐటీసీ, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ నాలుగు శాతం వరకు క్షీణించాయి. బీపీసీఎల్‌, ఎస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు మూడు శాతం వరకు పడ్డాయి. యాక్టివ్‌గా ఉన్న ఇతర షేర్లలో జీఎంఆర్‌ 5 శాతం పెరగ్గా, గృహ్‌ ఫైనాన్స్‌ ఇవాళ మరో 8.5శాతం క్షీణించింది.