ప్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

ప్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. నిన్న యూరో, రాత్రి అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. డాల‌ర్ మ‌రింత‌గా క్షీణించింది. దీంతో ముడి చ‌మురు ధ‌ర‌లు ఒక శాతంపైగా పెరిగాయి. ఒపెక్ నుంచి ఖ‌త‌ర్ వైదొల‌గ‌డం, ఈ నెల 6న ఒపెక్ స‌మావేశం ఉండ‌టంతో ఆయిల్ మార్కెట్‌లో టెన్ష‌న్ నెల‌కొంది. ఉద‌యం ప్రారంభ‌మైన ఆసియా మార్కెట్లు ఒక మోస్త‌రు న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. నిన్న రెండు నుంచి మూడు శాతం పెర‌గ‌డంతో ఇవాళ అధిక‌స్థాయిల వ‌ద్ద లాభాల స్వీక‌ర‌ణ జ‌ర‌గ‌వ‌చ్చు. హాంగ్‌సెంగ్‌, జ‌పాన్ నిక్కీతో పాటు చైనా మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం 5 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. రూపాయి ఇవాళ ఓపెనింగ్‌లో స్వ‌ల్పంగా బ‌ల‌ప‌డింది. నిన్నబాగా క్షీణించిన ఫార్మా ఇవాళ స్థిరంగా ఉంది. 

నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఓఎన్‌జీసీ, స‌న్ ఫార్మా, టాటా మోటార్స్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు టాప్‌లో ఉన్నాయి. ఇక బాగా న‌ష్ట‌పోయిన నిఫ్టి షేర్ల‌లో  మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ ఉన్నాయి. చురుగ్గా ట్రేడ‌వుతున్న ఇత‌ర షేర్ల‌లో ఆర్ కామ్ ఇవాళ కూడా అయిదు శాతం పెర‌గ్గా, ఇన్ఫీ బీమ్ 8 శాతం పెరిగింది.